Ayyappa Rise in pilgrims flying in to Sabarimala: కేరళలోని శబరిమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. శబరిమలలో ఒక్కసారిగా అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ తరుణంలోనే.. శబరిమల అయ్యప్పస్వామి సర్వ దర్శనానికి 10 గంటలు పడుతోంది. అటు శబరిమల అయ్యప్ప స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లు ఇచ్చింది ట్రస్టు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/01/ayyappa.jpg)
పంబ నుంచి సన్నిదానం వరకు.. భారీగా క్యూలైన్లలో అయ్యప్ప భక్తులు వేచివున్నారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.
- శబరిమలలో ఒక్కసారిగా పోటెత్తిన అయ్యప్ప భక్తులు
- 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శనం
- అయ్యప్పస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
- స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లు ఇచ్చిన ట్రస్టు
- పంబ నుంచి సన్నిదానం వరకు..
- భారీగా క్యూలైన్లలో వేచివున్న అయ్యప్ప భక్తులు
- క్యూలైన్లలో వేచివున్న భక్తులు కనీస వసతులు ఏర్పాటు