అయోధ్య చిత్రాలతో బనారసీ చీరలు

-

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సంబురాలకు ముహూర్తం సమీపిస్తోంది. ఆలయ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు కూడా పంపారు. మరోవైపు అయోధ్య రామమందిర సంబురాలను ప్రఖ్యాత ‘బనారసీ చీరలు’ నేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి చూపుతున్నాయి. ఈ చీరల కొంగులపై రామ మందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి రావణ సంహారం దాకా రాముడి జీవిత చరిత్రలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, చీరల అంచులపై ‘శ్రీరామ’ నామాలు ఉండాలని కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చీరల ధరలు రూ.7 వేల నుంచి రూ.లక్ష దాకా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమకు ఆర్డర్లు వస్తున్నాయని వారణాసిలోని ముబారక్‌పుర్‌ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసుర్‌ రెహమాన్‌ చెప్పారు. జనవరి 22వ తేదీన ఈ చీరలు ధరించి తమ తమ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవాలని మహిళలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. పల్లూపై ‘రామ్‌దర్బార్‌’ చిత్రం ఉండాలంటూ అమెరికా నుంచి తమకు రెండు ఆర్డర్లు వచ్చినట్లు మరో కార్మికుడు మదన్‌ వెల్లడించారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ తమకు భారీగా ఉపాధి లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version