ఏపీలో ‘ఇండియా’ తరహా కూటమి: కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం

-

ఏపీలోనూ ఇండియా తరహా కూటమి ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కలుపుకొని ఇండియా తరహా కూటమి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతోనే కలిసి నడుస్తున్నాయని ఆరోపించారు.

ఏపీలోని రాజమహేంద్రవరంలోని ఓ వేడుక మందిరంలో ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సమాలోచన సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో 175 సీట్లకు 175 తమకే కావాలను కోవడం నిరంకుశత్వానికి ప్రతీక అని శీలం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏడు గ్యారెంటీలతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. షర్మిల రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల హక్కులు హరిస్తున్నాయని అన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని సమావేశాలు నిర్వహించడం హర్షణీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ సాకే శంకర్‌, పీసీసీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశ్‌, కొలిమి వినయ్‌కుమార్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్‌ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version