మరో పురుషుడు గృహహింకు గురయ్యాడు. మరో భర్త భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు – చిక్కబనవారలో నివాసం ఉండేప్రశాంత్ నాయర్(40) లెనోవాలో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా, భార్య పూజా నాయర్ డెల్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య కలహాలు మొదలయ్యాయి. తరుచుగా గొడవలు జరుగుతన్నాయి.
ఈ నేపథ్యంలో తన భార్య పూజ తనను మానసికంగా బాధపెడుతోంని తండ్రితో ప్రశాంత్ నాయర్ తరచూ చెప్పేవాడు ఈ క్రమంలో భార్య వేధింపులు తట్టుకోలేక, ఆదివారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రశాంత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే తన కోడలి వల్లే కుమారుడు సూసైడ్ కు పాల్పడ్డాడని ప్రశాంత్ నాయర్ తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల భార్యాబాధితుల ఆత్మహత్య కేసులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.