కుంభమేళాలో చనిపోతే మోక్షం అంటూ బీహార్ ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేశ్ రంజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు హాజరవుతున్న రాజకీయ నాయకులు, ధనవంతులు అక్కడే చనిపోవాలన్నారు. ఎందుకంటే కుంభమేళాలో చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 600 మంది వరకు చనిపోయారన్న ఆయన.. కనీసం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- బీహార్ ఎంపీ పప్పు యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ధనవంతులు, రాజకీయ నాయకులు కుంభమేళాలో చనిపోవాలన్న పప్పు యాదవ్
- అప్పుడే వారికి మోక్షం లభిస్తుందన్న బీహార్ స్వతంత్ర ఎంపీ
- కుంభమేళా తొక్కిసలాటలో చనిపోయిన వారు మోక్షం పొందారని ఒక బాబా చెప్పారన్న పప్పు యాదవ్
- బాబాలు, సంపన్నులు, రాజకీయ నాయకులు త్రివేణీ సంగమంలో చనిపోయి మోక్షం పొందాలంటూ కామెంట్