లాలూ మాస్టర్ స్ట్రోక్..  నీతీశ్​ బలపరీక్షకు ముందు 10 మంది జేడీయూ ఎమ్మెల్యేలు దూరం!

-

బిహార్ లో కొత్తగా ఎన్డీఏతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం నితీశ్ కుమార్ బలపరీక్ష సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. బలపరీక్షలో నెగ్గి ఎన్​డీఏతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించాలని నీతీశ్​ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు విశ్వాస పరీక్షలో నీతీశ్​ను ఓడించి, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆర్​జేడీ, కాంగ్రెస్ మహా కూటమి వ్యూహాలు రచిస్తోంది. బలపరీక్షలో నీతీశ్ ను ఎలాగైనా ఓడించాలని ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్ తీవ్రంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో జేడీయూ ఎమ్మెల్యేలు పార్టీ నేత ఇచ్చిన విందుకు గైర్హాజరు కావడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మంత్రి శ్రవణ్​ కుమార్​ విప్​ జారీ చేసి మరీ జేడీయూ ఎమ్మెల్యేలను విందుకు ఆహ్వానించగా దాదాపు 10 మంది జేడీయూ ఆ పార్టీకి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. వీరికి ఆర్​జేడీ వల వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే దీనిపై స్పందించిన జేడీయూ నేతలు తామంతా ఐక్యంగా ఉన్నామని, నీతీశ్​ కుమార్​కు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version