బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి సిద్ధమవుతోంది. 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలని వేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే బీహార్ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాక్సిన్ ఖర్చు భరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ ని రెండు వందల యాభై రూపాయలకి ఒక డోస్ ని ఇస్తోంది. అదే ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే వ్యాక్సిన్ ఫ్రీగా పొందొచ్చు.
గత బుధవారం ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి మరియు 45 ఏళ్లు పైబడిన వాళ్ళకి కరోనా వ్యాక్సిన్ మార్చి 1వ తేదీన ఫ్రీగా ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రైవేట్ ఆస్పత్రిలో అందిస్తున్నట్లు చెప్పడం జరిగింది. సీఎం నితీష్ కుమార్ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఈరోజు తీసుకోనున్నారు. తదుపరి దశలో 60 ఏళ్ల పైబడిన వారికి మరియు 40 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. మొదటి డోస్ ని సీఎం నితీష్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం 1:00 కి IGIMS ఆసుపత్రిలో తీసుకోనున్నారు.