రెండు వేలు దాటిన బ్లాక్‌ ఫంగస్‌ మరణాలు

-

కరోనా నుంచి కోలుకున్న వారిలో కొంతమంది బ్లాక్‌ ఫంగస్ (Black Fungus) బారిన పడుతున్న విషయం తెల్సిందే. అయితే కరోనా రెండో దశ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో బ్లాక్‌ ఫంగస్‌ విజృంభణ కలవరపెడుతోంది. ఇటు బ్లాక్‌ ఫంగస్‌ మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

 

కాగా ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 31,216 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు కాగా.. 2,109 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. స్టెరాయిడ్లు ఎక్కువ తీసుకున్నవారిలో బ్లాక్‌ఫంగస్‌ ముప్పు ఎక్కువగా ఉంటోందని వైద్యులు వెల్లడించారు. ఇక కేంద్రం ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలో కూడా చేర్చాయి.

దేశంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల విషయానికి వస్తే అత్యధికంగా మహారాష్ట్రలో 7,057 కేసులు నమోదు కాగా 609 మంది మరణించారు. ఇక గుజరాత్‌లో 5,418 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడగా… రాజస్థాన్‌లో 2,976 కేసులు వెలుగుచూసాయి. కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీలోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిన్‌-బి మెడిసిన్ కొరత వల్లే బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version