రాజకీయాల్లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు

-

బాలీవుడ్లో చాల మంది నటులు ఇప్పటికే రాజకీయాల్లో చేరి ఉన్నత పదవుల్లో సేవలందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో బీ టౌన్ సీనియర్‌ నటుడు గోవిందా చేరారు. తాజాగా ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన శిందే వర్గంలో చేరిన గోవిందాకు బాలాసాహెబ్‌ భవన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివసేన శిందే వర్గం తరపున వాయవ్య ముంబయి లోక్‌సభ స్థానం నుంచి గోవిందా పోటీ చేయనున్నారు.

2004 లోక్‌సభ ఎన్నికల్లో గోవిందా ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించి ఆ ఎన్నికల్లో బీజేపీ సీనియర్‌ నాయకుడు రామ్‌ నాయక్‌ను ఓడించారు. తర్వాత కాంగ్రెస్‌కు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఎలాంటి రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. ఇక తాజాగా మరోసారి రాజకీయ రంగ పునఃప్రవేశం చేసిన ఆయ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. తన తల్లిదండ్రులకు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రేతో మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version