Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ఉమకు అదనపు బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.
ఈ సారి ఎన్నికల్లో సీట్ల సద్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న ఉమాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. కాగా మొన్నటి జాబితాలో టీడీపీ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమాకు టికెట్ దక్కలేదు.