అయోధ్య రామ్ మందిర్ పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు

-

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్న వేళ ఓ సంఘటన తీవ్ర అలజడి కలిగిస్తోంది. అయోధ్య నూతన రామ మందిరాన్ని పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర తివారీకి చెందిన ఈ-మొయిల్‌ ఐడీకి కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.

2023 డిసెంబర్ 27వ తేదీన దేవేంద్ర తివారీకి పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న జుబేర్ ఖాన్ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపాడు. దేవేంద్ర తివారీతోపాటు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యాష్ను గోసేవకులుగా పేర్కొంటూ వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతే కాకుండా అయోధ్య నూతన రామమందిరాన్ని కూడా బాంబులతో పేల్చేస్తానని మెయిల్లో బెదిరింపులకు పాల్పడ్డాడు.

దేవేంద్ర తివారీ తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ స్క్రీన్ షాట్ను తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేసి యూపీ పోలీసులతోపాటు సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులను ట్యాగ్ చేశారు. దేవేంద్ర తివారీ ఫిర్యాదు మేరకు లఖ్నవూ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version