న్యూ ఇయర్ వేళ ముంబయికి బాంబు బెదిరింపు కాల్స్‌

-

నూతన సంవత్సర వేడుకలకు భారత్ ముస్తాబవుతోంది. ఈ ఏడాదిలో చివరి రోజైన ఈరోజుకు గ్రాండ్‌గా గుడ్ బై చెప్పేందుకు ప్రజలు వివిధ రకాల ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ ఈవెంట్స్‌తో దేశవ్యాప్తంగా సందడి షురూ అయింది. ఈ న్యూ ఇయర్ వేళ దేశ ఆర్థిక రాజధాని ముంబయి మాత్రం భయంతో వణికిపోతోంది. ముంబయిలో బాంబు బెదిరింపు కాల్స్‌ కలకలం రేపుతున్నాయి. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాడానికి ఎదురు చూస్తున్న ప్రజలను ఈ వార్తలతో భయాందోళనకు గురవుతున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ముంబయి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశాడు. న్యూఇయర్‌ వేడుకలు జరుగుతున్న వేళ అవి ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చని వార్నింగ్ ఇచ్చాడు. ఈ కాల్‌తో నగర పోలీసులు అప్రమత్తమై ముంబయి అంతా విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని పోలీసులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఫోన్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version