‘హనుమాన్‌’ రిలీజ్‌ వాయిదా వేయకపోవడానికి కారణమదే : ప్రశాంత్‌ వర్మ

-

సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద సినిమాలు వరుస కడతాయన్న విషయం తెలిసిందే. ఈ పోటీని తట్టుకోవడం కాస్త కష్టమే. అయితే ఈ పోటీ నుంచి తప్పుకోమని తనను కొందరు అడిగారని హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ అన్నారు. అయితే తాను ఈ చిత్ర విడుదలను వాయిదా వేయలేనని అందుకు గల కారణమేంటో కూడా చెప్పుకొచ్చారు.

అయితే ఈ సినిమా విడుదల వాయిదా వేయడానికి తనకెలాంటి ఈగో లేదని.. కానీ తమకు ఇప్పుడు హిందీ మార్కెట్ చాలా ముఖ్యమని చెప్పారు. నార్త్‌లో ఈ మూవీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్లు రెణ్నెళ్ల క్రితమే మూవీ చూశారని.. ఈ సినిమాను వాళ్లు జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రమోషన్స్ చేస్తున్నారని చెప్పారు. రిలీజ్ వాయిదాకు వాళ్లు అంగీకరించలేదని.. అందుకే తాము అనుకున్న తేదీకే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. నిర్మాత సహకారంతోనే సినిమాను ఈ స్థాయిలో తీర్చిదిద్దగలిగానని తెలిపారు. జనవరి 12న ‘హనుమాన్‌’ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version