దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్టు CEO అలిస్ వాజ్ తెలిపారు. సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది మొత్తం 5 వేల మందిని నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.
అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… వెనకంజలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆయన… పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజ లో ఉన్నారు. సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.