భర్తను హిజ్రా అని పిలవడం నేరమే.. హైకోర్టు సంచలన తీర్పు!

-

Calling husband Hijra is a crime High Court sensational verdict: భర్తను హిజ్రా అని పిలవడం కూడా.. నేరమే అని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలా పిలవకూడదని పంజాబ్ హర్యానా హైకోర్టు…స్పష్టం చేయడం జరిగింది. తాజాగా ఇదే విషయం పైన పంజాబ్ అలాగే హర్యానా హైకోర్టు విచారణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను అలా పిలవడం క్రూరత్వమే అని తెలిపింది. భర్తను భార్య హిజ్రా అని పిలవడం మానసిక వేధింపులకు ప్రేరేపించినట్లు అవుతుందని హర్యానా పంజాబ్ కోర్టు… స్పష్టం చేసింది.


కింది స్థాయి కోర్టు ఇచ్చిన విడాకులను సవాల్ చేస్తూ ఓ మహిళ పంజాబ్ అలాగే హర్యానా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే తన భార్య అశ్లీల వీడియోలకు బానిస అయ్యిందని… ఈ సందర్భంగా కోర్టు ముందు తెలిపాడు భర్త. అంతేకాదు తనను శారీరకంగా… బలహీనంగా ఉన్నాం అంటూ అనేకసార్లు అవమానించిందని… కోర్టు ముందు భర్త తెలిపాడు.ఇక ఈ కేసులో భార్య ప్రతివాదులను తోసిపుచ్చిన హైకోర్టు… కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను హిజ్రా అని పిలిచి అవమానించడం… నేరమే అవుతుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version