కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. అయితే నిపుణులు కరోనా వ్యాక్సిన్ తర్వాత సెక్స్ లో పాల్గొనవచ్చా అనే విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ని హెల్త్ మినిస్టరి ఇచ్చారు.
పురుషులు మరియు మహిళలు కాంట్రాసెప్టివ్స్ ని రెండవ డోసు తీసుకున్న తర్వాత ఉపయోగించాలని వెల్లడించారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కొంత కాలం వరకూ సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయట. అది పురుషులకి, మహిళలకి కూడా వివిధ సమస్యలకు దారి తీస్తుంది.
టీకాలు వేయించుకున్న తరువాత శృంగారానికి దూరంగా ఉండడానికి సాధ్యపడదు. అందుకని నిపుణులు ఏమంటున్నారంటే..? నివారణ అన్నిటికంటే ఉత్తమ రక్షణ కాబట్టి రెండో డోస్ తీసుకున్న తర్వాత పురుషులు మరియు మహిళలు కాండోమ్స్ వంటి కాంట్రాసెప్టివ్స్ ని ఉపయోగించడం ఉత్తమమని అంటున్నారు.
కనీసం రెండు నుంచి మూడు వారాల వరకూ ఉపయోగించాలని తెలియజేసారు. ఏది ఏమైనా వ్యాక్సిన్ మనకి ప్రభావం చూపుతుంది కనుక కాండోమ్స్ ని వాడడం ఉత్తమమైనది మరియు తక్కువ ఖర్చుతోనే జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలానే మహిళలు వ్యాక్సిన్ తీసుకునే ముందు గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తే మంచిది.