కర్ణాటకలో కార్ పూలింగ్ చేస్తే.. రూ.10 వేలు జరిమానా

కార్ పూలింగ్ చేసేవారికి ఊహించని షాక్‌ తగిలింది. కర్ణాటకలోని బెంగుళూరులో కార్ పూలింగ్ పై అధికారులు నిషేధం విధించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10,000 వరకు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

Carpooling is now illegal In Karnataka
Carpooling is now illegal In Karnataka

క్యాబ్ అసోసియేషన్ల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వ్యక్తిగత అవసరాల కోసం టాక్సీ ప్లేట్ లేని ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడమే కార్ పూలింగ్. తాజా ఆదేశాలతో ప్రైవేట్ వాహనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే జరిమానా విధిస్తారు.

అలాగే.. కర్ణాటకలో గైడెన్స్ వాల్యూ పేరిట రిజిస్ట్రేషన్లపై టాక్స్ పెంచేసింది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలు నెరవేర్చేందుకు రెవెన్యూ భర్తీ చేసేందుకు అడ్డగోలుగా టాక్స్ వడ్డింపు చేయనుంది. ఈ రోజు నుంచి దీన్ని అమలు చేయనుంది సర్కార్‌. బెంగళూరులోని కమర్షియల్ స్థలాలపై 25% నుండి 70% పెంపు. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగుకు రూ.500 నుండి రూ.750 వరకు పన్ను వాయింపు ఉండనుంది.