NTA నుంచి నీట్ పేపర్ దొంగిలించిన మాస్టర్మైండ్ అరెస్ట్

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ ప్రధాన నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్ హజారీబాగ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించిన పంకజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో పాటు పేపర్ లీక్కు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేయడంతో ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.

నిట్ జంషెడ్పుర్లో 2017 బ్యాచ్ సివిల్ ఇంజినీర్ అయిన పంకజ్ కుమార్- హజారీబాగ్లోని ఎన్టీఐ ట్రంక్ పెట్టెల నుంచి నీట్ ప్రశ్నాపత్రాన్ని దొంగిలించాడని సీబీఐ అధికారులు తెలిపారు. అనంతరం రాజు సింగ్ అనే వ్యక్తికి అందజేయగా, అతడు తన గ్యాంగ్ సభ్యులకు చేరవేశాడని.. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బొకారోకు చెందిన పంకజ్ కుమార్ను బిహార్ రాజధాని పట్నాలో అరెస్ట్ చేయగా, రాజును హజారీబాగ్లో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లను సీబీఐ అధికారులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version