ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 30 సెలవులు ఇవ్వబోతున్నట్లుగా స్పష్టం చేసింది. ఇందులో 20 సగం వేతనంతో కూడిన సెలవులు, 8 క్యాజువల్ లీవ్స్, 2 రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ ఉంటాయని పేర్కొంది.

ఇతర వ్యక్తిగత కారణాల కోసం కూడా ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చని రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా… ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా రూ. 65 కోట్ల బకాయి వేతనాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడు లేదా నాలుగు రోజులలో శ్రామికుల బ్యాంకు ఖాతాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి.