చంద్రయాన్‌–3 మిషన్‌.. హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం

-

చంద్రయాన్-3 కౌంట్‌ డౌన్‌ షురూ అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మరికొద్ది గంటల్లో ప్రయాణం మొదలుకానుంది. నాలుగేళ్ల కిందట చెదిరిన ‘జాబిల్లి’ కళను తిరిగి సాకారం చేసుకునేందుకు రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. చంద్రుడిపై అన్వేషణకు 2019లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చివరి మెట్టుపై విఫలమైన విషయం తెలిసిందే.

వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొని మరింత ఆత్మ విశ్వాసంతో చంద్రయాన్-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ప్రయోగానికి సంబంధించి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దవన్ స్పేస్ సెంటర్ లో గురువారం మధ్యాహ్నం 2:35 గంటలకు ప్రారంభమైన 24 గంటల కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ కౌంట్ డౌన్ పూర్తయిన తర్వాత నేటి మధ్యాహ్నం 2:35 గంటలకు ఎల్విఎం-3 ఎం4 రాకెట్ ద్వారా దూసుకెళ్లనుంది. అయితే.. చంద్రయాన్-3 కు హైదరాబాద్‌ కు చెందిన కొంత మంది శాస్త్రవేత్తలు కూడా సేవలు అందించారట. వారే ఇందులో కీలకమని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version