కేంద్ర ఎన్నికల సంఘటన సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రకటించిన ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం 2 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. తొలుత జూన్ 4న కౌంటింగ్ ఉండగా.. ఇప్పుడు జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
ఇక అటు కేరళ, తమిళనాడులో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేసింది. ఐయూఎంఎల్ ప్రధాన కార్యదర్శి సలామ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయని గుర్తు చేశారు. ఈ రెండు తేదీలు శుక్రవారం వస్తున్నాయని, ఆరోజు ముస్లింలకు ముఖ్యమైన రోజు కాబట్టి ముస్లిం అధికారులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందన్నారు. అందుకే రెండు తేదీలను మార్చాలని తెలిపారు.