జీ-20 పత్రాలపై ‘వసుధైక కుటుంబం’ అనే వ్యాఖ్య.. అభ్యంతరం తెలిపిన చైనా

-

చైనా మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. అత్యంత శక్తివంతమైన జీ-20 కూటమికి ఏడాది పాటు భారత్‌ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో దిల్లీలో జీ20 దేశాల అగ్రనేతల సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో జీ-20 ఎనర్జీ మినిస్టీరియల్‌ మీటింగ్‌ జరిగింది. ఇందుకోసం ప్రచురించిన పత్రాలు, ఇతర పత్రాలపై భారత్ సంస్కృత వాక్కు ‘వసుధైక కుటుంబం’ ముద్రించింది.

అయితే దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సంస్కృతానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లేదనే కారణంతో చైనా ఆ వాక్కును వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్య సమితి గుర్తించిన అరబిక్‌, చైనీస్‌, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌, రష్యన్‌, స్పానిష్‌ మాత్రమే అధికారిక భాషలని డ్రాగన్‌ వాదిస్తోంది. దాంతో జీ-20 పత్రం ఫైనల్‌ కాపీలో ఇంగ్లిష్‌ను చేర్చినట్లు తెలుస్తోంది. ‘వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) అని రాశారు. జీ-20 సదస్సుతో అనుసంధానించిన అన్ని లెటర్‌ హెడ్‌లపై, లోగోలో వసుధైక కుటుంబాన్ని అలాగే ఉంచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version