నేడు భార‌త్‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి ప‌ర్య‌ట‌న‌

-

చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ నేడు భార‌త్ లో పర్య‌టించ‌నున్నారు. ఆగ్నేయాసియా దేశాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చైనా విదేశాంగ మంత్రి నేడు భార‌త్ లో ప‌ర్య‌టిస్తారు. అందు కోసం గురువారం సాయంత్ర‌మే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి చేరుకున్నారు. కాగ ఆయ‌న నిన్న పాకిస్థాన్ లో త‌న ప‌ర్య‌ట‌న ముగించుకుని సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నేడు భార‌త విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జ‌య‌శంక‌ర్ తో పాటు జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోభాల్ తో చైనా విదేశాంగ శాఖ మంత్రి స‌మావేశం కానున్నారు.

అయితే.. పాక్ పర్య‌ట‌న‌లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ క‌శ్మీర్ పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. క‌శ్మీర్ విషయాన్ని ఓఐసీ స‌ద‌స్సులో ప‌లు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్ర‌స్తావించాయని అన్నారు. చైనా కూడా అదే కోరుకుటుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై భారత్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. జ‌మ్ము క‌శ్మీర్ పూర్తిగా భార‌త్ అంత‌ర్గత అంశం అని స్ప‌ష్టం చేసింది.

దీనిలో చైనా తో స‌హా ఏ దేశం కూడా జోక్యం చేసుకోరాద‌ని తెల్చి చెప్పింది. కాగ ఈ వ్యాఖ్య‌లు చేసిన కొద్ది గంట‌ల్లో చైనా విదేశాంగ మంత్రి.. భార‌త్ లో ప‌ర్య‌టిస్తున్నారు. అలాగే భార‌త విదేశాంగ శాఖ మంత్రి తో పాటు భ‌ద్ర‌తా స‌ల‌హాదారు తో స‌మావేశం కానున్నారు. అయితే ఈ స‌మావేశం పై ప్ర‌స్తుతం ఉత్కంఠ నెల‌కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version