మోదీకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

-

నేడు ప్రధాన మంత్రి మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలన్నీ హ్యాపీ బర్త్ డే మోదీ అనే హాష్ ట్యాగ్‌తో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. మరోవైపు మోదీకి సంబంధించిన బైట్స్, విజువల్స్‌తో కొందరు అద్భుతమైన వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ప్రజల తరపున కూడా కేసీఆర్ మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు సీఎం వెల్లడించారు. దేశానికి ఇంకా చాలా ఏళ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version