బెంగాల్ ఘటనపై సీఎం మమతా బెనర్జీ, రైల్వే మంత్రి దిగ్భ్రాంతి

-

బంగాల్​ డార్జిలింగ్​ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూజల్‌పాయ్‌గుడి సమీపంలో కాంచన్‌జంఘూ ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి ఓ గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 20మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్సీ, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయని తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

A terrible train accident in Bengal

ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version