గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన పంచాయితీ పెద్దదై ఇరువర్గాల మధ్య గొడవకు దారి తీసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్‌లను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి అరెస్టులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని బీజేవైఎం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రెండో రోజు ఈ బంద్ పట్టణంలో ప్రశాంతంగా కొనసాగుతోంది.
బంద్‌లో భాగంగా మెదక్ పట్టణంలో అత్యవసర సేవలు మినహా పలు వ్యాపార సంస్థలు, హోటళ్లు, పెట్రల్ పంపులు స్వచ్ఛందంగా బంద్ చేశాయి. రెండో రోజు ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పలు కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు.