ప్రపంచాన్ని వణికించిన కరోనా ఈమధ్య కాస్త గ్యాప్ ఇచ్చింది. అని.. అనుకునేలోపే.. మళ్లీ ఎంట్రీ ఇస్తోంది. నాలుగు నెలల తరువాత భారత్‌లో అధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు.. 754 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో కర్ణాటక ఒకరు మృతి చెందారు.
మొత్తంగా భారత్‌లో 4,633 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2022 నవంబర్‌లో అత్యధికంగా 734 కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఆ తరువాత బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన కేసులో అత్యధికమని తెలిపింది.
కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు 5,30,790 మంది మరణించారు. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య.. 4,46,92,710. ప్రస్తుతం 0.01 శాతం కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ కేసుల రికవరీ శాతం 98.80గా ఉంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,57,297కి పెరిగింది. మృతి చెందిన వారి శాతం 1.19గా ఉంది.