భారత్ కరోనా వైరస్ విషయంలో సమర్ధవంతంగా పని చేస్తుంది. చాలా జాగ్రత్తగా చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం రికవరీలలో కూడా ఇండియా చాలా మెరుగ్గా పని చేస్తుంది. కరోనా మొదలైన తర్వాత మరణాలు తగ్గించడం రికవరీలు పెంచడం మీదనే ఎక్కువగా ఫోకస్ చేసారు. భారతదేశంలో మరణాల రేటు మార్చి 22 నుండి 1.5% వద్ద తక్కువగా ఉంది.
14 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనా మరణాల నిష్పత్తి 1% కన్నా తక్కువగా ఉంది. గత 24 గంటల్లో 500 కంటే తక్కువ మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణా, ఏపీ, మహారాష్ట్రలో కరోనా మరణాలు తగ్గుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసలు కరోనా మరణాలు నమోదు కాలేదు. కేసులు కూడా మన దేశంలో తగ్గాయి.