బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

-

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల జాడ కానరావడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నైరుతి పవనాల రాక ఆలస్యానికి కారణాలను వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపోర్‌ జాయ్‌’ తుపాను మరింత తీవ్ర తుపానుగా మారింది. ఈ ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడింది. తుపాను కారణంగా రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘‘నైరుతి రుతుపవనాల రాక ఇప్పటికే ఆరు రోజులు ఆలస్యమైంది. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను కారణంగా.. ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో 2 – 3 రోజులు పట్టే అవకాశముంది’’ అని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version