ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌.. ఈ వైరస్‌తో కాంటాక్టులు హ్యాక్‌!

-

ఆండ్రాయిడ్‌ యూజర్లను ఓ కొత్త వైరస్ వణికిస్తోంది. దామ్ వైరస్ ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని కాల్‌ రికార్డులను తస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కాంటాక్ట్స్‌, హిస్టరీ, కెమెరాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇది హ్యాక్‌ చేస్తుందని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ విభాగం CERT-In వెల్లడించింది. యాంటీవైరస్‌కు చిక్కకపోవడంతోపాటు ఫోన్లలో వైరస్‌ను చొప్పించే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉందని తెలిపింది.

‘థర్డ్‌ పార్టీ వెబ్‌సైట్లు లేదా ఇతర విశ్వసనీయతలేని సైట్ల ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఈ వైరల్ ఫోన్లోకి వచ్చిన తర్వాత సెక్యూరిటీ విభాగాలను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత సున్నితమైన డేటా చోరీకి ప్రయత్నిస్తుంది. హిస్టరీ, బుక్‌మార్కులను చదవడం.. బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెసింగ్‌ను కిల్‌ చేయడంతోపాటు కాల్‌లాగ్స్‌ను రీడ్‌ చేయడం వంటివి చేస్తుంది. అంతేకాకుండా ఫోన్‌ కాల్‌ రికార్డింగ్స్‌, కాంటాక్టులను హ్యాక్‌ చేయడం, కెమెరా యాక్సెస్‌ పొందడం, డివైజ్‌ పాస్‌వర్డులను మార్చడం, స్క్రీన్‌షాట్స్‌ను తీయడం, ఎస్సెమ్మెస్‌లను తస్కరించడం, ఫైల్స్‌ డౌన్‌లోడింగ్‌/అప్‌లోడింగ్‌ చేయడంతోపాటు వీటిని బాధిత ఫోన్‌ నుంచి సర్వర్‌కు చేరవేసే సామర్థ్యం ఈ వైరస్‌కు ఉంది’ అని CERT-In పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version