పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 – 26 కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31 నుండి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు.
ఇక ఫిబ్రవరి 1 న బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయి. జనవరి 31 నుండి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్.. నెలరోజుల గ్యాప్ తర్వాత రెండవ విడత మొదలుకానున్నాయి. ఇవి మార్చి 10వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగుతాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశపెట్టబోతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంవత్సరం కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేసి అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచబోతున్నట్లు సమాచారం.