విశాఖ స్టీల్ 35 వేల కోట్ల రుపాయల నష్టాల్లో ఉంది : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి

-

విశాఖ స్టీల్ కోసం 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1982 లో ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం తో “విశాఖ స్టీల్” ప్రారంభమైంది. గత జులై లో “విశాఖ స్టీల్” ను సందర్శించాను అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి అన్నారు. ఆ తర్వాత, ఎస్.బి.ఐ తో సహా పలు బ్యాంకులను ఆర్ధిక తోడ్పాటును అందించాలని కోరాను. 13 శాతం వడ్డీతో 11 వేల కోట్ల రుణం తీసుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ విశాఖ స్టీల్ ను విస్తరణ చేపట్టారు. “కోవిడ్” సమయంలో “విశాఖ స్టీల్” కు రూ. 930 కోట్ల నష్టం వచ్చింది. చివరకు “విశాఖ స్టీల్” పునరుద్దరణ కోసం కేంద్ర అర్ధిక మంత్రి తో చర్చించాను.

అనుభవజ్ఞురాలైన కేంద్ర ఆర్ధిక మంత్రి కి పునరుద్దరణ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రధాని తో జరిగిన భేటీ తో, పునరుద్ధరణ పై నాకు కొంత ఆశాజనకమైన నమ్మకం ఏర్పడింది. ఏపి సి.మ్ తో కలిసి, కేంద్ర ఆర్దిక మంత్రి తో చర్చల తర్వాత, ఆర్దిక తోడ్పాటును అందించేందుకు అంగీకరించారు. అంతిమంగా, ఫలవంతమైన నిర్ణయాలు తీసుకోవడమైంది. మొత్తానికి ప్రధాని మోడి ఆశీస్సులతో, ఆంధ్ర ప్రదేశ్ సోదర, సోదరీమణులకు తోడ్పాటు అందించే అవకాశం నాకు లభించింది. ఇక ప్రయివేటీకరణ సమస్య ఉత్పన్నం కాకూడదనే, ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ఇప్పటికీ “విశాఖ స్టీల్” 35 వేల కోట్ల రుపాయల నష్టాల్లో ఉంది. 18 వేల కోట్ల రూపాయులు బ్లాంకుల రుణాలతో పాటు, 17 వేల కోట్ల రూపాయలు ముడి సరుకు సరఫరా చేసిన సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలున్నాయు. “విశాఖ స్టీల్” నష్టాలను పూర్తి స్తాయులో అధిగమించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తాం. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ప్రస్తుతానికి ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని మంత్రి కుమార స్వామి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version