Delhi CM Atishi casts her vote: ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ సీఎం అతిషి.. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో దిగిన ఢిల్లీ సీఎం అతిషి.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు కల్కాజీ ఆలయంలో అతిషి ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు ఉండనున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఉండనున్నాయి.
ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి..
కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో దిగిన అతిషి
ఓటు వేసే ముందు కల్కాజీ ఆలయంలో అతిషి ప్రత్యేక పూజలు pic.twitter.com/DIxMZGywK6
— BIG TV Breaking News (@bigtvtelugu) February 5, 2025