ముఖంపై జుట్టు, ఉదయం లేవగానే గుండె దడ, చెమటలా..? మధుమేహం కావొచ్చు

-

దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటైన మధుమేహం ఇండియా వ్యాప్తంగా అనేక మందిని బాధిస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. అధిక రక్త చక్కెర స్థాయిలు అలాగే కొనసాగితే అది కొంత కాలానికి మూత్రపిండాలు, గుండె, ఇతర అంతర్గత ప్రక్రియలకు హాని కలిగిస్తుంది. మరోవైపు, టైప్ 1 మధుమేహం అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను సృష్టించడం ఆపివేసినప్పుడు, రక్తంలో చక్కెరను నిర్వహించడానికి శరీరానికి సొంతంగా ఇన్స్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అసలే ఉండదు.

ఈ స్థితిలో బయట నుంచి హార్మోన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకరికి కంటి చూపు మీద ప్రభావం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలు క్రాష్ అయినప్పుడు, వేగంగా గుండె కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం లేదా విపరీతమైన ఆకలిగా అనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఏమైనా మీలో కనిపిస్తే.. వెంటనే అప్రమత్తమవ్వండి.

ఆడవారిలో జుట్టు రాలడం

మీ బ్లడ్ స్ట్రీమ్‌లో బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల అది మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆడవారిలో అధిక గ్లూకోజ్ స్థాయిలు వారి శరీరంలో అధిక టెస్టోస్టెరాన్ (పురుష సెక్స్ హార్మోన్) ఉత్పత్తికి కారణమవుతాయి. ఫలితంగా ఇది వారి తలపై వెంట్రుకలు రాలిపోవడానికి, బట్టతలకి దారితీస్తుంది. ముఖంపై వెంట్రుకలు కూడా పెరుగుతాయి.

గుండె దడగా అనిపించడం

రాత్రి సమయంలో గ్లూకోజ్ క్రాష్ అయినపుడు అంటే రాత్రి భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్పైక్ ఎక్కువైనపుడు దాని ప్రభావం ఉదయం లేచినపుడు కనిపిస్తుంది. మేల్కొన్న తర్వాత తీవ్రమైన చెమట, వికారంగా, గుండె దడదడగా ఉంటుంది. ఉదయం ఈ పరిస్థితి రాకుండా నివారించడానికి రాత్రివేళ తక్కువ GI కలిగిన ఆరోగ్యకరమైన భోజనం తినడానికి ప్రయత్నించండి.

తామర

గ్లూకోజ్ స్పైక్‌లు శరీరంలో మంటను పెంచుతాయి. మీరు తామర వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. మీకు ఇదివరకే చర్మ సమస్యలు ఉంటే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు ఆ పరిస్థితిని మరింత పెరుగుతుంది.

మెదడులో గందరగోళం

మీరు మీ ఆలోచనలను ట్రాక్ చేయలేకపోతున్నారని లేదా దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నారని ఎప్పుడైనా అనిపించిందా? మీ రక్తంలో చక్కెర స్థాయిలు మీ మెదడు పనితీరును మందగించడానికి దారితీయవచ్చు. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు జరిగినప్పుడు, మెదడులోని న్యూరాన్‌ల మధ్య సిగ్నల్‌లలో వేగం మందగించవచ్చు. ఇది మెదడు స్థితిని అయోమయానికి గురిచేస్తుంది.

స్థిరమైన ఆకలి

మీరు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతుంటే ఇది రక్తంలో అసమతుల్య చక్కెర స్థాయిలకు సంకేతం. గ్లూకోజ్ స్పైక్‌లు, అదనపు ఇన్సులిన్ మన ఆకలి హార్మోన్లను గందరగోళానికి గురి చేస్తుంది. ఈ కారణంగా నిరంతరం మనకు ఆకలి దప్పికలను కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news