నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..మ్యాజిక్‌ ఫిగర్ ఎంతంటే ?

-

 

 

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. 19 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఢిల్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ అంచనాలు వేసుకుంటోంది. బిజెపిని గెలుస్తుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ లెక్కలు వేస్తున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 60.54 శాతం పోలింగ్ నమోదు అయింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2.5% పోలింగ్ తగ్గింది.

Delhi Election Results 2025

న్యూఢిల్లీ నియోజకవర్గం లో అరవింద్ కేజ్రీవాల్ పై బిజెపి నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షితులు పోటీ చేశారు. కల్కాజిలో ముఖ్యమంత్రి అతిశయి బిజెపి నుంచి రమేష్ బిదూరి కాంగ్రెస్ నుంచి అల్క లంబాల పోటీ చేశారు. మొత్తం ఢిల్లీ లోని 70 అసెంబ్లీ స్థానాల్లో 39 సీట్ల వరకు బిజెపి గెలుస్తుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. 2013లో తొలిసారి అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. 49 రోజుల తర్వాత రాజీనామా చేసిన కేజ్రీవాల్ 2015, 2020లో వరసగా భారీ విజయాలతో గెలిచారు కేజ్రీవాల్. ఇక ఢిల్లీ మేజిక్ ఫిగర్‌ 36 గా ఉంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ పీఠం ఎవరికి సొంతం కానుందనే టెన్షన్‌ అందరిలోనూ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version