ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్ పూరి ఏరియాలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉందని… ఎలాంటి పుకార్లను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. నిన్న జరిగిన హనుమాన్ శోభాయాత్రలో సామాన్యులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. 8 మంది పోలీసులు, 1 పౌరుడు సహా 9 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్కు బుల్లెట్ గాయమైంది.