మరోసారి వాయిదాపడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక

-

ఢిల్లీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే రెండుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మేయర్ ఎన్నిక మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులను మేయర్ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారి సత్యాశర్మ అనుమతి ఇవ్వడంపై ఆఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో మేయర్ ఎన్నిక కోసం జరిగిన మూడవ సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది. ఓటింగ్ హక్కుల అంశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చేపట్టడంతో ఎన్నికను వాయిదా వేశారు. బిజెపి తమ నిరసనలతో మేయర్ ఎన్నికల ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని ఆప్ మండిపడింది. ఇక మరోవైపు మేయర్ ఎన్నికల కోసం ఆఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version