కొద్ది రోజులు యూపీఐ పేమెంట్లు చేయ‌కండి.. ఎందుకంటే..?

-

యూపీఐ ద్వారా న‌గ‌దు చెల్లింపులు, ట్రాన్స్ ఫర్‌లు చేస్తున్నారా ? అయితే ఆగండి. మీరు వాడే బ్యాంక్‌కు చెందిన మొబైల్ బ్యాంకింగ్ లేదా, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌ల‌ను ఉప‌యోగించండి. యూపీఐ సేవ‌ల‌ను వాడ‌కండి. ఎందుకంటే నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) త‌న ప్లాట్‌ఫాంను అప్‌గ్రేడ్ చేస్తోంది. క‌నుక పేమెంట్లు స‌రిగ్గా కావు. ఈ క్ర‌మంలోనే ముందు జాగ్ర‌త్త‌గా ఎన్‌పీసీఐ ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

ఎన్‌పీసీఐ త‌న ప్లాట్‌ఫాంను రోజూ రాత్రి 1 నుంచి 3 గంట‌ల మ‌ధ్య అప్‌గ్రేడ్ చేయ‌నుంది. దీంతో ఆ స‌మ‌యంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినా, న‌గ‌దును పంపించుకున్నా స‌మ‌స్య‌లు తలెత్తేందుకు అవ‌కాశం ఉంది. క‌నుక ఆయా స‌మ‌యాల్లో యూపీఐ ను వాడ‌కూడ‌ద‌ని ఎన్‌పీసీఐ తెలియజేసింది. అయితే కొద్ది రోజుల వ‌ర‌కు అని చెప్పింది కానీ ఎన్ని రోజుల వ‌ర‌కో చెప్ప‌లేదు. అందువ‌ల్ల ఎందుకైనా మంచిది ఎన్‌పీసీఐ ద్వారా చెల్లింపులు చేసే వారు అందుకు బ‌దులుగా మొబైల్ బ్యాంకింగ్ లేదా, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌ను వాడితే మంచిది.

కాగా క‌రోనా నేప‌థ్యంలో డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్లు పెరిగాయి. ప్ర‌జ‌లు కాంటాక్ట్ లెస్ ప‌ద్ధ‌తి సేఫ్ అని భావించారు. అందుక‌నే చాలా మంది యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో యూపీఐ యాప్స్‌లో స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ‌య్యాయి. ప్ర‌జ‌లు న‌గ‌దును ట్రాన్స్ ఫ‌ర్ చేసినా, చెల్లింపులు చేసినా చాలా స‌మ‌యాల్లో స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. దీంతో న‌గ‌దు అకౌంట్ నుంచి క‌ట్ అవుతుంది. కానీ అవ‌త‌లి వారికి చేర‌డం లేదు. ఫ‌లితంగా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌ను బ్యాంకులు ప‌రిష్క‌రిస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version