ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్

-

ఇస్రో చైర్మన్ గా డాక్టర్ వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ, క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదిలో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆదిత్య L1, చంద్రయాన్2, చంద్రయాన్ -3 వంటి చారిత్మక ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు.

ఇస్రో చైర్మన్  గా రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు వి.నారాయణన్. అనగా జనవరి 14, 2027 వరకు కొనసాగుతారు. చైర్మన్ కంటే ముందు ఆయన కేరళలోని వలియమాలాలో ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ చీఫ్‌గా పని చేస్తోన్నారు. కేరళలోని వలియమాలాలో ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ చీఫ్‌గా పని చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో క్రయోజనిక్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చదివారు. అక్కడే ఏరో స్పేస్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు వీ నారాయణన్. ఎంటెక్‌లో సిల్వర్ మెడల్ అందుకున్నారు. రాకెట్- అనుబంధ రంగంలో ఆయనకు ఉన్న ప్రతిభను గుర్తించి ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా బంగారు పతకాన్నీ అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news