కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్ కేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్ కేసుకు సంబంధించిన రూ.300 కోట్ల విలువ కలిగిన 142 స్థిరాస్తులను జప్తు చేశారు ఈడీ అధికారులు. ముడా స్కామ్లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ ఆస్తులను లింక్ చేసింది ఈడీ.
ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్ కేసు కీలక ప్రకటన చేసింది ఈడీ. కర్ణాటక లో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య, ఈ కేసులో ఇరుకున్న వారిపై IPC, 1860, అవినీతి నిరోధక చట్టం, 1988లోని వివిధ సెక్షన్ల కింద లోకాయుక్త పోలీసులు మైసూర్ నమోదు చేసిన FIR ఆధారంగా ED దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే..