ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. దలాల్ స్ట్రీట్ ఢమాల్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేసిన తర్వాత 50కి పైగా దేశాలు వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. గత బుధవారం నాటి ప్రకటన తర్వాత పలు దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ తెలిపారు. ఇంతలో తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే సున్నా సుంకాల ఆధారంగా వాణిజ్య చర్చలను ప్రతిపాదించారు. అమెరికన్ పెట్టుబడులను పెంచడం గురించి మాట్లాడారు.

ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. దలాల్ స్ట్రీట్ ఢమాల్ అయింది. భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 3000+ పాయింట్స్ డౌన్ అయింది. 836 పాయింట్లు కోల్పోయింది నిఫ్టీ. మరోవైపు.. ట్రంప్ ప్రకటించిన సుంకాలతో ఆస్ట్రేలియా, జపాన్, చైనా, సింగపూర్, మలేషియా, తైవాన్ దేశాల స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వచ్చాయి. 10 శాతం పతనమయ్యాయి సోనీ షేర్లు. దీంతో సుంకాల తగ్గింపుపై అగ్రరాజ్యంతో చర్చలకు పలు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి.