కారు నేతల కూతలు మాత్రం కదల్లేదు.. టైం వేస్ట్ చేశారు : మంత్రి కొండా సురేఖ ట్వీట్

-

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు, రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ సహా మంత్రులు సైతం రేషన్ లబ్దిదారుల ఇంటికి వెళ్లికి సన్నబియ్యంతో భోజనం చేశారు. తాజాగా ఇదే విషయంపై మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా స్పందించారు.

‘సీఆర్ మనవడు ఏ బియ్యం తింటుండో.. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులంతా అదే బియ్యం తింటున్నారని గతంలో కొంతమంది గప్పాలు కొట్టారు.కానీ ఏమైంది… కాలం ముందుకు కదిలింది. కారు నేతల కూతలు మాత్రం కదల్లేదు. మొత్తానికి కాలాయపన జరిగింది. నేడు అదే రాష్ట్రంలో పాలన మారింది. ప్రజల బతుకులు మార్చే కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చింది. సంక్షేమ హాస్టల్లోనే కాదు… రాష్ట్రంలోని ప్రతీ గడపకు… ప్రతీ ఇంటికి సన్నబియ్యం పంపిణీ చేస్తూ.. రామరాజ్యాన్ని తలపిస్తున్న కాంగ్రెస్ ప్రజా పాలన’ అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news