Elections in Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్ లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతం నుంచే… జమ్మూ కాశ్మీర్లో తుది దశ ఎన్నికలు ప్రారంభం కావడం జరిగింది. అయితే జమ్మూలో 24, కాశ్మీర్ లోయలో 16 స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 40 స్థానాలకు గాను 415 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
39.18 లక్షల మంది ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. అంతేకాదు 5060 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 20వేల మంది సిబ్బంది ఈ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మొదటి దశలో 24 స్థానాలకు ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. రెండవ దశలో 26 స్థానాలకు ఎన్నికలు పెట్టారు. ఇక ఇవాళ 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దేశ బార్డర్ లో జమ్మూ కాశ్మీర్ ఉన్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.