భారత దేశంలోని సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఇవాళ వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అక్టోబర్ ఒకటో తేదీ వచ్చిన నేపథ్యంలో… గ్యాస్ ధరలను పెంచేశాయి కంపెనీలు. ప్రతి ఒకటో తారీకు గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి వంటగ్యాసు ధరలు పెరగడం జరిగింది. ప్రతినెల మొదటి తేదీన ఎల్పిజి ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు… ఇవాళ కూడా రేట్లను అప్డేట్ చేశాయి.
దసరా అలాగే దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో భారీగా రేట్లు పెంచేశాయి చమురు కంపెనీలు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధర 1900 రూపాయలు దాటిపోయింది. దీంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అయితే ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు కంపెనీలు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ మహానగరంలో కమర్షియల్ సిలిండర్ ధర 1947 రూపాయలుగా ఉంది. అలాగే… ఇంట్లో వాడే సిలిండర్ ధర 840 గా ఉంది.