ఎయిర్ ఇండియాకు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. మూకుమ్మడిగా సెలవులు పెట్టారు ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులు. అనారోగ్య కారణాలతో ఒకే రోజు 300 మంది సెలవు పెట్టారు. 25 మందికి పైగా క్యాబిన్ క్రూ సెలవు తీసుకున్నారట. ఉద్యోగుల సెలవులతో 100కి పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దు అయ్యాయని సమాచారం. రెండు రోజుల్లో 15 వేల మందికి పైగా ప్రయాణికులకు ఇబ్బంది చోటు చేసుకుందట.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ఏఐఎక్స్ కనెక్ట్ సంస్థతో విలీనం అనే కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు సిబ్బంది. అందుకే మూకుమ్మడిగా సెలవులు పెట్టారు ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులు. సెలవులు పెట్టి నిరసనలు తెలుపుతున్నారు.
ఉద్యోగుల సెలవుల కారణంగా ఢిల్లీ, కొచ్చి, కాలికట్, బెంగుళూరు సహా ప్రధాన ఎయిర్పోర్ట్స్ లో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీంతో సెలవులో ఉన్న సిబ్బంది తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.