భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేడ్కర్ చరిత్రలో నిలిచిపోయారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం.. రాజ్యాంగం ప్రాణం పోసుకున్న రోజు ఇది. భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి దేశాన్ని ఉన్నత స్థాయికి మహోన్నత వ్యక్తి అంబేడ్కర్. రాజ్యాంగం గురించి, మన దేశం గురించి ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు. ఆయన చెప్పిన ఆణిముత్యాల్లాంటి మాటలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఓసారి చూద్దామా.!
నా శరీరం చచ్చిపోయినా
భారత రాజ్యాంగ రూపంలో నేను బతికే ఉంటాను.
రాజ్యాంగాన్ని చంపినప్పుడే
నేను శాశ్వతంగా కన్నుమూస్తాను.
గొప్ప వ్యక్తికి, ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది.
గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకే ప్రాముఖ్యత ఇస్తాడు.
ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు.
ఆశయాలను ఆచరణలో పెడితేనే
మానవుడు మహనీయుడు అవుతాడు.
సకాలంలో సరైన చర్య తీసుకుంటేనే
దాని ఫలితం పది కాలాలపాటు నిలుస్తుంది.
క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది.
ఎవరిని నీచంగా చూడకండి.
ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే
నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం.
ఎవరో వేసిన సంకెళ్లను వారినే వచ్చి తీసేయమని ప్రాధేయపడే కన్నా
మనమే శక్తి, సామర్థ్యాలను పెంచుకొని
వాటిని చేదించడం మంచిది.
రాజ్యాంగం దుర్వినియోగం అయిందని,
నేను కనుగొంటే దానిని కాల్చే మొదటి వ్యక్తిని నేనే.
మేకల్ని బలి ఇస్తారు, సింహాలను కాదు
మీరంతా సింహాల్లా బతకండి.
కేవలం పుస్తకాలను చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది?
చెదపురుగులు కూడా పుస్తకాలు నమిలేస్తాయి.
అంతమాత్రాన వాటికి జ్ఞానం వస్తుందా?
దేశానికి గాని, జాతికి గాని సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు.
ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
పునాదుల మీద దేనిని సాధించలేం
ఒక జాతి నీతిని నిర్మించలేం.
నేను, నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యం.