పిల్లల మీద కోపంతో 23 కోట్ల ఆస్తిని కుక్కలు, పిల్లుల మీద రాసిన మహిళ

-

ఈరోజుల్లో చాలా మంది పిల్లలు.. తల్లిదండ్రులను ఆదాయవనురుగానే చూస్తున్నారు. వాళ్ల ఆస్తి మాకు రాసి ఇవ్వాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు. పిల్లలు సుఖంగా ఉంటారులే అని రాసి ఇచ్చినా.. ఆ తర్వాత కూడా ఆ వృద్ధులను సుఖంగా చూసుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కుక్కల కంటే హీనంగా తల్లిదండ్రులను చూస్తున్నారు. పిల్లలు మనతో నివసించరని దాదాపు అందరు తల్లిదండ్రులకు ఇప్పుడు తెలుసు.

కానీ పిల్లలు టచ్ లో ఉండాలని, తరచూ వచ్చి వెళ్లాలని, వారి ఆరోగ్యం గురించి ఆరా తీయాలని, రోజూ ఫోన్ చేసి మాట్లాడాలని మాత్రం కోరుకుంటారు. కానీ చాలా మంది పిల్లలు, వారి బాధ్యతలు పెరిగేకొద్దీ, వారు తమ కుటుంబాలను ఏర్పరచుకున్న తర్వాత తల్లిదండ్రులను మరచిపోతున్నారు. వారితో పూర్తిగా సంబంధాన్ని కోల్పోయినవారూ ఉన్నారు. పిల్లల ఈ ప్రవర్తన తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీస్తుంది. వారిలో ఈ మహిళ కూడా ఒకరు. పిల్లల ప్రవర్తనతో బాధపడిన మహిళ.. పిల్లలపై ప్రతీకారం తీర్చుకుంది.

ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ మహిళ పేరు లియు. ఆమె ఇంట్లో ఒంటరిగా నివసించేది. ఆమె పిల్లలు ఆమెకు దూరంగా ఉన్నారు. లియు అనారోగ్యానికి గురైనప్పుడు కూడా పిల్లలు ఆమెను చూడటానికి రాలేదని స్థానిక వార్తాపత్రిక నివేదించింది. పిల్లల ప్రవర్తనతో లియు పూర్తిగా కృంగిపోయింది. ఆమె ఇంట్లో పెంపుడు కుక్క, పిల్లులు ఉన్నాయి. లియు తన చివరి క్షణాల వరకు ఈ కుక్క మరియు పిల్లితో జీవించింది. తల్లి మరణవార్త తెలుసుకున్న తర్వాత ఆమె సంపదను స్వాధీనం చేసుకునేందుకు పిల్లలు ఇంటికి వచ్చారు. కానీ అమ్మ రాసిన వీలునామా చూసి బాధపడ్డారు.

మరణానికి ముందు, లియు తన ఆస్తి ఎవరికి చెందాలో వీలునామా రాసింది. ఆమె తన ఆస్తిలో ఒక్క పైసా కూడా తన పిల్లలకు ఇవ్వలేదు. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువుల పేరిట ఆస్తులన్నీ రాసింది. ఆమె ఆస్తుల విలువ 2.8 మిలియన్లకు పైగా అంటే 23 కోట్ల 27 లక్షల 16 వేల రూపాయలు.

చైనాలో జంతువుల పేరుతో నేరుగా డబ్బు బదిలీ చేయడం లేదు. కాబట్టి లియు పశువైద్యులను జంతు సంరక్షకులుగా మార్చింది. ఈ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి మరియు పెంపుడు జంతువుల కోసం డబ్బును ఉపయోగించుకునే అధికారం వారికి ఉంది. అయితే ఈ సొమ్మును పశువైద్యులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లియు కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లియు పరిస్థితిపై పలువురు వ్యాఖ్యానించారు. లియు సరైన పని చేసిందని కమెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version