దేశాన్ని రక్షించినా.. నా భార్యను కాపాడుకోలేకపోయా.. మణిపుర్ ఘటనపై కార్గిల్ వీరుడి ఆవేదన

-

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవర పెట్టింది. ఈ ఘటనలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దేశం తలదించుకునేలా చేసిన ఈ ఘటనలో ఓ బాధితురాలు మాజీ సైనికుడి భార్య అని తెలిసింది.  ఈ అమానవీయ ఘటన గురించి మాజీ సైనికుడు నేషనల్ మీడియాతో మాట్లాడారు.

‘కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం పోరాడిన నేను నా సొంత ఊళ్లో నా ఇంటిని, భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నన్నెంతో కుంగుబాటుకు గురిచేస్తోంది’ అని ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ మాజీ సైనికుడు కన్నీరు మున్నీరుగా విలపించారు.

‘మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. అనంతరం ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి ఊరేగించి అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలి’ అని ఆ కార్గిల్‌ వీరుడు డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version