ప్రధాని పీఠంపై ఆశలేదు.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

-

విపక్షాల కూటమి ఇండియా తరపున ప్రధాని అభ్యర్థి ఎవరు ఉండొచ్చనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పీఎం పదవి తమకు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇదే అంశంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ… తనకు పీఎం కావాలనే కోరిక లేదని చెప్పారు. బీజేపీని గద్దె దించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.

మణిపూర్‌లో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుకరిస్తున్న వైఖరిని ఆమె తప్పుపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆమె పలు ప్రశ్నలు సంధించారు. ‘ప్రధాని మోదీని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. మణిపూర్‌లో వెలుగుచూసిన దారుణ సంఘటన మీకు కొంచమైనా బాధ కలిగించలేదా..? మీరు బెంగాల్‌ను వేలెత్తి చూపుతున్నారు. కానీ మణిపూర్‌లో హింసకు గురవుతున్నా చెల్లెల్లు, తల్లులపై మీకు ప్రేమ లేదా..? ఇంకా ఎన్నాళ్లు మణిపూర్‌లో ఆడబిడ్డలు తగులబడాలి..? ఇంకా ఎప్పటిదాక దళిత, మైనారిటీలు హత్యలకు గురికావాలి..? ఎన్నాళ్లు ప్రజలు కూనీ కావాలి..?’ అని మమతాబెనర్జి ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version