ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా అధికంగా చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినా వాటిని పట్టించుకోకుండా అధిక వేగంతో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మినీ వ్యాన్ లో కొంతమంది యాత్రికులు తిరుచెందూర్ లోని ‘సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలోనే తిరుగు ప్రయాణంలో వారు ఉలుందూర్పేట శివారులోకి చేరుకోగానే మినీ వ్యాన్ అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు.